Vinnara vinnara subhavaartha Song Lyrics | విన్నారా విన్నారా Song Lyrics - Revanth Christmas Song Lyrics
Singer | Revanth |
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా||
దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా||
ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||