Sugandha Tailamu Kante Song Lyrics | సుగంధ తైలము కంటే Song Lyrics - Gospel Song Lyrics
Singer | Ramana |
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు
ఒకని జన్మ దినము కంటే మరణదినమే మేలు (2)
నరకానికి పోవుటకంటే మనిషి పుట్టకుండుటే మేలు
పరలోకం చేరలంటే ప్రభుని నమ్ముకొనుటయే మేలు
ఏది మేలు ఏది మేలు మనిషికి లోకమంతా చదివిన
మేధావికి "సుగంధ "
1 పువ్వులు ఆకులు నలిగితే సువాసన వస్తుంది
గంధపు చెక్కలు అరిగితే సుగంధం వస్తుంది (2)
కష్టాలలో నలిగిన క్రైస్తవ జీవితం
యేసుక్రీస్తు ప్రభువుకు ఇంపైన పరిమళం. (2)
ఏది మేలు ఏది మేలు మనిషికి లోకమంతా చదివిన
మేధావికి " సుగంధ "
2 ప్రార్ధన ఉపవాసముతో పోరాడిన వణితలు
ఎస్తేరు రూతు హన్నా మరియ తల్లులు. (2)
దైవగ్రంధములో వ్రాయబడిన త్యాగవంతులు
జీవగ్రంధములో పేరును దాచుకున్న ధన్యులు (2)
ఏది మేలు ఏది మేలు మనిషీకి లోకమంతా చదివిన
మేధావికి "సుగంధ "
3 దేవుడు హేంచించే వరకు దీనుడవై యుండుము
అబ్రహము నీరక్షణకు నూరేళ్లని ఎరుగుము. (2)
మృతతుల్యమైన సారా గర్భమున వాగ్దానపు
ఫలము పొంది ఇస్సాకును కనెను. (2)
ఏది మేలు ఏది మేలు మనిషికి లోకమంతా చదివిన
మేధావికి " సుగంధ "