Okapari Thalachina Song Lyrics | ఒకపరి తలచిన Song Lyrics - Hariharan Christian Song Lyrics
Singer | Hariharan |
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా 2
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ
ఇదే కదా నీ ప్రేమ చరితం. ( ఒకపరి )
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు
విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్
నిన్నే సేవింతును. ( ఒకపరి )
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా
దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా
తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై
నన్నే నడిపించేనా..... ( ఒకపరి )