Ninnu kolicheda ravayya Song Lyrics | నిన్నుగొలిచెద రావయ్యా Song Lyrics - Bible Mission Song Lyrics
Singer | Bro. A R Stevenson |
నిన్నుగొలిచెద రావయ్యా - నా యేసన్నా
నిన్ను గొలిచెద రావయ్యా
హృదయ దేవళమందు - ముదమున నిన్ను నిల్పి
భక్తి పుష్పములచే - భజియించి పూజించి - 2|| నిన్ను ||
పాడుకొందును రావయ్యా - నీ ప్రేమను వేడుకొందును రావయ్యా
అన్నవస్త్రములకై అల్ల లాడిన నాకు అన్నా నీ వొసగిన అన్నవస్త్రములకై|| నిన్ను ||
చెప్పు కొందును రావయ్యా - నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా
పాపక్షమాపణ - శాపవిమోచన పాప బంధితు నాకు - చూపిన ప్రేమకై|| నిన్ను ||
శుభ్ర పరచితి రావయ్యా - నా హృదయము భద్రపరచితి రావయ్యా
నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురౌ - నా ప్రాణము - సదయాత్మ పరమాత్మ|| నిన్ను ||
దాచుకొందును రావయ్యా - నీ రూపము చూచుకొందును రావయ్యా
దోషాత్ముడను నాదు దోష మంతయు బాపి - రూపమేర్పరచినా - దాపునుండిన రాజా|| నిన్ను ||