Chirakala sneham nee prema charitham Song Lyrics | చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Singer | Priya |
చిరకాల స్నేహం – నీ ప్రేమ చరితం – చిగురించె నా కోసమే
నీపై నా ధ్యానం – నాకై నీ త్యాగం – వింతైన సందేశమే
1. కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయె మౌనమై
నేను నీకు భారమైన దూరమైన వేళలో
నీవే నాకు చేరువై చేరదీసినావయా
ఎంత ప్రేమ యేసయ్యా
2. గాలిమేడ నీడ చెదరి క్రుంగిపోయే నామాది
సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో
దారికి చేరి దారి చూపి దైర్యపరచినావయా
తోడు నీవే యేసయ్యా
3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు
శిలగనేను నిన్ను చేర నీదురూపు కలిగెను
శ్రేష్టమైన స్యాస్వస్థ్యమందు నను నిలిపినావయా
నిలిపినావు యేసయ్యా