Vivarinchedanu Yehova Kriyalu Song Lyrics | వివరించెదను యెహోవా క్రియలు Song Lyrics - A R Stevenson Song Lyrics
Singer | Dinesh |
వివరించెదను యెహోవా క్రియలు
ప్రకటించెదను ఆశ్చర్య కార్యములు
చెల్లించెదను కృతజ్ఞతా స్తుతులు
అర్పించెదను నా మ్రొక్కుబడులు
జాలి చూపి చేతులు చాపి - తన చెంతకు రమ్మని పిలిచెను
నాడు ఘోర పాపము బాపి - తండ్రి ఇంటిలో నను పిలిచెను
నన్ను కరుణించెను - కృప కుమ్మరించెను || వివరించెదను ||
చింతలన్నీ దూరం చేసి - సంతోషముతో నను నింపెను
అంతరంగపు భారం తీసి - స్తుతి గీతమునే పలికించెను
నన్ను కరుణించెను - కృప కుమ్మరించెను || వివరించెదను ||
దివ్యమైన కాంతిని పంపి - నా చీకటిని తొలగించెను
భవ్యమైన శాంతితో నింపి - హృదయ దీపం వెలిగించెను
నన్ను కరుణించెను - కృప కుమ్మరించెను || వివరించెదను ||