Type Here to Get Search Results !

Stutinchedanu stutinchedanu Song Lyrics | స్తుతించెదను..స్తుతించెదనూ Song Lyrics | TPM Songs Lyrics

Stutinchedanu stutinchedanu Song Lyrics | స్తుతించెదను..స్తుతించెదనూ Song Lyrics - TPM Song Lyrics Lyrics

Singer TPM Team

పల్లవి:
స్తుతించెదను..స్తుతించెదనూ..
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను - 2

1.
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను - 2
...స్తుతించెదను...

2.
నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి - 2
...స్తుతించెదను...

3.
పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా - 2
...స్తుతించెదను...

4.
తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి - 2
...స్తుతించెదను...

5.
సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా - 2
...స్తుతించెదను...




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.