Type Here to Get Search Results !

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు Song Lyrics | Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Song Lyrics - Latest Christmas Song Lyrics

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు Song Lyrics | Rajulaku Raju Prabhuvulaku Prabhuvu Song Lyrics - Latest Christmas Song Lyrics

Singer Priya

రాజులకు రాజు
ప్రభువులకు ప్రభువు
రక్షకునిగ అరుదెంచిన రోజు
మహోన్నతుడు సర్వశక్తుడు
పుడమిపై పుట్టిన రోజు "2"
అ.ప: అదే అదే క్రిస్మస్ రోజు "4"
" రాజులకు రాజు "

1.విశ్వమంత ఏలేటి రారాజుకు
తలవాల్చుటకు
చోటు లేకుండెను "2"
బెత్లెహేములో పసుల తొట్టిలో
రక్షకుడేసు పవళించెను "2"
" అదే అదే క్రిస్మస్ రోజు "
" రాజులకు రాజు "

2.తూర్పుదేశ జ్ఞానులు
ప్రభువును గాంచ
తారను చూసి పయనించిరి "2"
బంగారము,సాంబ్రాణి,
బోళములను కానుకగ
అర్పించిరి "2"
" అదే అదే క్రిస్మస్ రోజు "
" రాజులకు రాజు "

3.గొర్రెలను కాయుచున్న కాపరులకు
దేవదూత శుభవార్త అందించెను "2"
వేగిరమే ప్రభువు చెంత కేతెంచి
స్తోత్రములు ఆయనకు చెల్లించిరి "2"
" అదే అదే క్రిస్మస్ రోజు "
" రాజులకు రాజు "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.