పూజ్యనీయుడా Song Lyrics | Poojyaneeyuda Song Lyrics - Prudhvi | Telugu Christian Worship Song Lyrics
Singer | Prudhvi |
పల్లవి -
పూజ్యనీయుడా నా ఆరాధనకు యోగ్యుడా
అధికస్తోత్రము పొందదగినవాడవు -
సర్వలోకానికే చక్రవర్తివి -2
నీ కార్యములు గంభీరములు - ఉహించలేనివి లెక్కకు మించి యున్నవి -2
|| పూజ్యనీయుడా||
చరణం - 1
నా కాలు జారెనని నేననుకొనగా నీకృపయే నన్ను బలపరచు చున్నది
నావిచారములు అధికమవ్వగా నీగొప్ప ఆదరణ నెమ్మదిచ్చు చున్నది-2
నా రక్షణ శృంగమునీవే - నీతికి ఆధారమునీవే -2.
నా హృదయసీమలో నీనీతిస్థాపించి 2
యెడబాయని నీ కృపలో నడిపించుచున్నావు-2.
||నీ కార్యములు||
చరణం - 2
నా దినములు నీడవలె
తొలగిపోవు చుండగా
నీ దీర్ఘశాంతమే నాపై కృపచూపుచున్నది
నా సంకటములు అధికమవ్వగా నీ గొప్ప కనికరమే స్వస్థతిచ్చు చున్నది - 2
నాఉన్నత దుర్గమునీవే-నా నివాసస్థలమునీవే -2
నా శత్రువు దాటలేని సరిహద్దులు వేసి - నీ దయా దాక్షణ్యము మాపై చూపితివి 2
||నీకార్యములు||