Type Here to Get Search Results !

నింగిలోన తారక Song Lyrics | Ningilona Taraka song lyrics | ధాత్రి నేడు రక్షకుండు - New Christmas Song Lyrics

నింగిలోన తారక Song Lyrics | Ningilona Taraka song lyrics | ధాత్రి నేడు రక్షకుండు - New Christmas Song Lyrics

Singer Jayanth Madhur

నింగిలోన తారక
చేయ వచ్చింది వేడుక
దారి చూపేందుకు తోడుగా
తానే నడిచింది ముందుగా || 2 ||
బెత్లహేములో పండుగ
వెలుగే వచ్చింది నిండుగా || 2 ||
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

దూత వార్త వినగానే గొల్లలు
అందరికి చాటారు శుభములు
సువార్త మతికి రాగానే జ్ఞానులు
మోకరించి ఇచ్చారు కానుకలు || 2 ||
కదలిరా సువార్త చాటగా
ప్రభువిచ్చెను మన భాద్యతగా || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

లోకమునే రక్షించిన ఈ దినము
నీ హృదయములో రావాలి నిత్యము
ప్రభు యేసే దేవుడనే సత్యము
నమ్మి మోకరించాలి ఈ క్షణము || 2 ||
తన రక్తమే శుద్ధి చేయును
మన పాపములు రద్దు చేయును || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area