నేనెల్లప్పుడు యెహోవాను Song Lyrics | Nenellappudu song lyrics | Calvary Temple song lyrics
Singer | Dr. Satish Kumar |
పల్లవి :-
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను..
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో..
నా జీవితాంతము నా యేసుని ఇలలో...
నే వెంబడించెదను..
ఓ...ఓ..ఓ..ఓ (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
చరణం:-
నీతిమంతుల మొర్రవిని శ్రమల నుండి విడిపించి
విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును (2)
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)
చరణం:-
నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని ..
కరువులో కష్టములో బాధలో బలహీనతలో (2)
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)