Nee krupa chalunu nee prema chalunu Song lyrics | నీ కృప చాలును నీ ప్రేమ చాలును Song Lyrics - Raj Prakash Paul | Old Christian Song Lyrics
Singer | Raj Prakash Paul |
నీ కృప చాలును నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు
నీవు లేని జీవితం అంధకార బంధురం
నీవు నాకు తోడుంటే చాలును యేసు
1. శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో
నీ ప్రేమ వర్షం నా స్ధితిని మార్చెగా నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్ నీవు నాకు తోడుంటే చాలును యేసు
2. నా ప్రేమ గీతం నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన్ అందుకో దేవా
నిను పోలె నేను ఈ లోకమందు నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా