Nakentho anandam nee sannidhi prabhuva lyrics | నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా | Telugu Christian Melody Song Lyrics
Singer | Unknown |
పల్లవి : నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే
1.ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా
|| నా కెంతో ||
2.నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా
|| నా కెంతో ||
3.నూతన యెరూషల్లెం నా గమ్యమెనని
నా కొరకు నీవు సిద్ధపరచు చుంటివా
నివుండు స్థలములో నేనుండ గొరేదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా
|| నా కెంతో ||