Type Here to Get Search Results !

Prabhu yesuni vadanamulo Song Lyrics | ప్రభు యేసుని వదనములో - Billmoria songs | Andhra kraisthva Keerthanalu Lyrics

Prabhu yesuni vadanamulo Song Lyrics | ప్రభు యేసుని వదనములో - Billmoria Garu Lyrics

Singer Billmoria Garu

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని||

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)
ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని||

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area