Adharamemunnadhi Song Lyrics | ఆధారమేమున్నదీ నీవుతప్ప | ఆరాధించెదా ..నా పూర్ణమనస్సుతో - Worship Song Lyrics
Singer | బ్రదర్.శ్రీ శైలము |
పల్లవి:-
ఆధారమేమున్నదీ నీవుతప్ప ఈలోకంలో, ...
ఆనందమేమున్నదీ నీవు లేక నాజీవంలో ..
"2"
ఆదుకొనుచుంటివే ..నా కన్నతండ్రివోలే..
ఆదరిస్తుంటివే ..నా కన్నతల్లివోలే,..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా..- నా యేసయ్యా-..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా .."2"
అను.పల్లవి :
ఆరాధించెదా ... నా పూర్ణమనస్సుతో .. - "2"
ఆరాధించెదా ... నా పూర్ణహృదయముతో..."2"
నా ఊపిరీ ఉన్నంత వరకయ్యా -
నా యేసయ్యా ..- నిన్నే నేను ఆరాధించెదా ."2"
చ:1.
ఎబినేజర నీవయ్యీ - నన్నాదుకుంటున్నావూ - ఎదలోన కొలువయ్యీ - నను నడుపుకుంటున్నావూ.."2"
- ఆరాధించెదా ...
చ: 2.
నినువిడువను , ఎడబాయననీ వాగ్ధానములిచ్చినావూ..
భయపడకూ , దిగులే పడకనీ - ధైర్యాన్ని నింపినావూ"2" ..
ఆరాధించెదా ...
చ:3.
సీయోను నగరాన - ఆ నిత్యరాజ్యాన - శుద్ధులతో నేకలసి - స్తుతిపాట పాడెదా "2" ఆరాధించెదా ...
ఆధారమేమున్నదీ నీవు తప్ప ఈ లోకంలో...
ఆనందమేమున్నదీ నీవులేక నా జీవంలో...