ఎంత కృపామయుడవు యేసయ్యా | Yentha Krupamayudavu Yesayya song lyrics | Worship Songs Lyrics

Singer | Unknown |
ఎంత కృపామయుడవు యేసయ్యా
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ॥2॥
నలిగితివి వేసారితివి నాకై ప్రాణము నిచ్చితివి
నాకై ప్రాణము నిచ్చితివి ॥ఎంత॥
1॰
బండలాంటిదీ నా మొండి హృదయం
ఎండిపోయినా నాదు పాప జీవితం ॥2॥
మార్చినావు నీ స్వాస్థ్యముగా ॥2॥
ఇచ్చినావు మెత్తని క్రొత్త హృదయం ॥2॥ఎంత॥
2॰
కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను వెలివేసినా ॥2॥
మరువలేదు నన్ను విడువలేదు ॥2॥
ప్రేమతో పిలచిన నాధుడవు ॥2॥ఎంత॥