పునరుత్థానుడా విజయశిలుడా | Punarudhanuda Vijayaseeluda | Telugu Christian Song Lyrics
Singer | Sis. Betty |
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||
కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||
మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||
నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||