నిజమైన ద్రాక్షావల్లి నీవే | Nijamaina drakshavalli neeve song lyrics | Jesus Songs

Singer | Unknown |
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2)
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)