నీవే కృపాధారము | Neeve krupadharamu - Hosanna | Telugu Christian Songs Lyrics
Singer | Hosanna |
నీవే కృపాధారము త్రియేక దేవా - నీవే క్షేమాధారము నాయేసయ్యా
నూతన బలమును నవనూతన కృపను
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
ఆనందించితిని అనురాగబంధాల - ఆశ్రయపురమైన నీలో నేను
ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైననీ ప్రేమనుచూపి
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి -
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
సర్వకృపానిధి సీయోను పురవాసి - నీస్వాస్థ్యముకై ననుపిలచితివి
సిలువనుమోయుచు నీచిత్తమును - నెరవేర్చెదను సహనముకలిగి
శిథిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకైచేసితివి-
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
ప్రాకారములను దాటించితివి - ప్రార్థనవినెడి పావనమూర్తివి
పరిశుద్ధులతో ననునిలిపితివి - నీకార్యములను నూతనపరచి
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నాలడుగులుజారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||