నీవాక్యమే నన్ను బ్రతికించెను | Nee vakyame nannu brathikinchenu lyrics | Jesus Song Lyrics
Singer | Unknown |
నీవాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా "నీవాక్య"
1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) "నీవాక్య"
2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2) "నీవాక్య"
3. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు - మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది (2) "నీవాక్య"