దేవా నా జీవితమిదిగో నీ సొంతం | Deva Naa Jeevithamidigo Nee - I For God | Telugu Christian Songs Lyrics

Singer | I For God |
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
నా కరములు నా పదములు నీ పనిలో
అరిగి నలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
దేవానా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ కొరకై
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవ యాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం...