ఉన్నత స్థలములలో నివసించువాడ - Rekha Vudara - Jesus songs telugu lyrics
Singer | Rekha Vudara |
పల్లవి:
ఉన్నత స్థలములలో నివసించువాడ
నీకే ఘనత మహిమ || 2 ||
|| ఉన్నత ||
అనుదినము స్తుతులకు పాత్రుడవు
నిత్యము ఆరాధనకర్హుడవు
తరతరములకు సదా కాలము
మహిమ కలుగును నీకే || ఉన్నత ||
చరణం:- 1
పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
అరణ్యము నుండి నడిపించును
మారాను మార్చి మన్నాను కురిపించి
బండ నుండి నీటిని రప్పించును || 2 ||
యాజక రూపకమైన రాజ్యము గాను
పరిశుద్ధమైన తన జనము గాను || 2 ||
నిత్యత్వములోనికి నడిపించుటకు || 2 ||
దహించు అగ్నియై ఆయన
నీ ముందర దాటిపోవుచున్నాడు || 2 ||
|| ఉన్నత ||
చరణం:- 2
శతృవునేదిరించుటకు శక్తి కలిగి నిలుచుటకు
సర్వాంగ కవచమును దరియింతుము
కీర్తనతోను సంగీతముతోను
కృతజ్ఞత స్తుతులను చెల్లింతుము || 2 ||
క్రీస్తును పోలి ఇలలో నడుచుకొని
ఆ క్రీస్తు ప్రేమను అంతట ప్రకటించి || 2 ||
మంచి పోరాటమును పోరాడి || 2 ||
యుగయుగములకు యుగముల అంతము వరకు
పరిశుద్ధులమై యుండెదము || 2 ||
|| ఉన్నత ||