Type Here to Get Search Results !

ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది | Ullaasa Jeevitham Adi | Telugu Christian Songs Lyrics

ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది - Telugu Christian Songs Lyrics

Singer unknown

ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది
ఉత్సాహమైనది అది నీతో నడచుటయే
కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి
కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2)
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి
నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి

కరుణే లేని కఠినుల మధ్య నన్నూ
కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా
కాపరి లేని జీవిత పయణంలోనా
నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా
నా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించి
నా మార్గం స్థిరపరిచావా – నా కోసం దిగి వచ్చి
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి
నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి

నలిగిన నా జీవిత పయణంలోనా
నీ నవ్వును పుట్టించావా యేసయ్యా
నూతనమైన జీవిత మార్గంలోనా
నా పాదం నీతో నడిపించావా యేసయ్యా
నా కోసం ఏర్పరిచావా – పరలోకపు నివాసము
నా కోసం తిరిగొస్తావా – నీ కోసం వేచుంటా
నీవు నా కోసం తిరిగొస్తావా – నన్నూ ప్రేమించి
నా జీవిత పయనం – నీతోనే యేసయ్యా (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area