Type Here to Get Search Results !

స్తుతియించి కీర్తించి ఘనపరతును - Sthuthiyinchi Keerthinchi - Praise and Worship Songs Lyrics

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా - Joshua Gariki - Praise and Worship Songs Lyrics

Singer Joshua Gariki

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area