రాజా నీ భవనములో రేయి పగలు - Ps Jyothi Raju - Praise and Worship Songs Lyrics
Singer | Ps Jyothi Raju |
(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందు (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
ఆరాధన నీకే (2)
రూపించి దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||