Type Here to Get Search Results !

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది | Puvvu Laantidi Jeevitham | Christian Song Lyrics

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది - Akumarthi Daniel | Christian Song Lyrics

Singer Akumarthi Daniel

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా
ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)

పాల రాతపైన నడిచినా గాని
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం
నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు||

జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే
అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||

ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే
ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||Telugu Christian Songs Lyrics