Type Here to Get Search Results !

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా - Oohinchalenayyaa Vivarinchalenayyaa - Emmanuel Ministries

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా - Emmanuel Ministries Lyrics

Singer Emmanuel Ministries
Song Writer Emmanuel Ministries

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area