Type Here to Get Search Results !

ఒకసారి నీ స్వరము వినగానే - Okasaari Nee Swaramu - Christian Songs Lyrics

ఒకసారి నీ స్వరము వినగానే - Dr John Wesly - Christian Songs Lyrics

Singer Dr John Wesly

ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||

నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||

ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area