నూతన యేరూషలేం నా గమ్యస్థానము - Surya Prakash - Emmanuel Ministries - Praise and Worship Song Lyrics
Singer | Surya Prakash |
పల్లవి: నూతన యేరూషలేం నా గమ్యస్థానము
సర్వోన్నత స్థలములో పాలు ప్రాప్తించెను(2)
నే సాగేదా.. నే పొరాడెదా.. ఆ గురియొద్దకే నేను చేరేదా.. (2)
ఆ.. హల్లే.. హల్లే.. హల్లేలూయా.. ఆ.. హల్లే.. హల్లేలూయా.. ||నూతన||
చరణం: చీకటిలో చెర యాతనలో నే క్రుంగి పడియుండగా
కోరుకొని నను చేరుకొని విడిపించి నడిపించితివే...(2)
నీ సాక్షినై జీవించుటకు నీ వాక్యపు వెలుగుతో నింపితివే.. (2)
ఆ.. హల్లే.. హల్లే.. హల్లేలూయా.. ఆ.. హల్లే.. హల్లేలూయా.. (2) ||నూతన||
చరణం: దుఃఖము నిట్టూర్పులను పరిపూర్ణముగా తొలగించు
హర్షముతో ప్రహర్షముతో నా హృదిని నింపితివే.. (2)
నిత్య సంతోషము నా తలమీదను ప్రోక్షించి పండుగ చేసితివే (2)
ఆ.. హల్లే.. హల్లే.. హల్లేలూయా.. ఆ.. హల్లే.. హల్లేలూయా.. (2) ||నూతన||
చరణం: మేఘమునై ఎగయు గువ్వనై నిను చేరు ఆ శుభవేళా
సంపూర్ణమైన బహుమానమే నేను పొందెదను..(2)
నవనూతనమైన నీ సృష్టిలో వేకువ చుక్కవలే నేనుందును (2)
ఆ.. హల్లే.. హల్లే.. హల్లేలూయా.. ఆ.. హల్లే.. హల్లేలూయా.. (2) ||నూతన||