Type Here to Get Search Results !

నలుగకుండ గోధుమలు | Nalugakunda Godhumalu | Calvary Christian Song Lyrics

నలుగకుండ గోధుమలు - S P Balu | Calvary Christian Song Lyrics

Singer S P Balu

నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ||

పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ||

రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area