Type Here to Get Search Results !

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే - Konthasepu Kanabadi - Telugu Christian Lyrics

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే - Dinesh - Telugu Christian Lyrics

Singer Dinesh
Song Writer A R Stevenson

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు||

ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే||

చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే||

నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area