కలనైనా ఇలనైనా - Ravinder Vottepu - telugu christian song lyrics
Singer | Ravinder Vottepu |
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై ||కలనైనా||
జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||