హల్లే హల్లే హల్లే హల్లేలూయా - Hanok Bonala | Praise and Worship Songs Lyrics
Singer | Hanok Bonala |
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||
నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||