Type Here to Get Search Results !

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - Aascharyakarudu Aalochanakartha - Praise and Worship Songs Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - సిరివెళ్ల హనోక్- Praise and Worship Songs Lyrics

Singer సిరివెళ్ల హనోక్

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area