ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు - Yesanna Garu | Ascharya karuda na alochana karthavu song lyrics | Hosanna Ministries Songs
Singer | Yesanna Garu |
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు (2)
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు (2)
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా (2)
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు (2)
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె (2)
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||