ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా - Diyya Prasadarao Christian Song Lyrics
Singer | Diyya Prasadarao |
ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా
ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2) ||ఆగక||
పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక||
తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||