Type Here to Get Search Results !

ఎన్ని తలచినా ఏది అడిగినా - Yenni talachina - Christian song lyrics - Enni Thalachinaa Edi Adiginaa Song Lyrics

ఎన్ని తలచినా ఏది అడిగినా - Betty Sandesh - Christian song lyrics - Enni Thalachinaa Edi Adiginaa Song Lyrics

Singer Betty Sandesh

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.