Type Here to Get Search Results !

నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు - NAA PRANAMA Telugu Christian Song Lyrics

నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు - Unknown Lyrics

Singer Unknown

నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ (2)
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా (2)
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ (2)
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా (2)
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ (2)
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ (2)
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area