దివ్య తార! దివ్య తార! దివినుండి దిగి వచ్చిన తార - Ramya- Telugu Christain Lyricz
Singer | Ramya |
Song Writer | Purushottham Babu |
We Wish You A HAPPY CHRISTMAS “2”
దివ్య తార! దివ్య తార! దివినుండి దిగి వచ్చిన తార "2"
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది "2"
పశుల పాకచేరినది క్రిస్మస్ తార "2" "దివ్య తార"
1. జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం "2"
మధురమైన పాటలతో మారు మ్రోగెను
"క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే" "2"
"తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య తార"
2. ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో నున్నది "2"
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
"క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే" "2"
"తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య తార"
3. పాప లోక జీవితం పటాపంచెలైనది"2"
నీతియై లోకములో వికసించినదీ
"క్రీస్తు జన్మమే ప్రేమామయమై
చీకటి హృదయాలలో వెలుగు తేజమే" "2"
"తార తార క్రిస్మస్ తార - తార తార ఆ దివ్య తార" "2" "దివ్య తార"