Type Here to Get Search Results !

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే - Anni Sadyame Yesuku Anni Sadhyame - Praise and worship songs lyrics

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే - Lillyan christopher - Praise and worship songs lyrics

Singer Lillyan christopher
Song Writer జే సీ కూచిపూడి

పల్లవి:
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా
ఆ యేసు రక్తానికే
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
ఆ యేసు రక్తానికే
సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

చరణం 1:
మాధుర్యమైన జలముగా - మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును - మహిమార్థముకై లేపెను
మాధుర్యమైన జలముగా - మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును - మహిమార్థముకై లేపెను

మన్నాను కురిపించగా - ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా - మృత్యుంజయుడై లేచెను
మన్నాను కురిపించగా - ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా - మృత్యుంజయుడై లేచెను

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

చరణం 2:
బండనే చీల్చగా - జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై - ఏరులై అవి పారెను
బండనే చీల్చగా - జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై - ఏరులై అవి పారెను

బండంటే క్రీస్తేనని - నీ దండమే తానని
మెండైన తన కృపలో - నీకండగా నిలచును
బండంటే క్రీస్తేనని - నీ దండమే తానని
మెండైన తన కృపలో - నీకండగా నిలచును

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

చరణం 3:
ఏకాంతముగా మోకరిల్లి - ప్రార్థించుటయే శ్రేయము
ఏల నాకీ శ్రమలని - పూర్ణ మనసుతో వేడుము
ఏకాంతముగా మోకరిల్లి - ప్రార్థించుటయే శ్రేయము
ఏల నాకీ శ్రమలని - పూర్ణ మనసుతో వేడుము

యేసయ్య నీ వేదన - ఆలించి మన్నించును
ఏ పాటి వ్యథలైననూ - ఆ సిల్వలో తీర్చును
యేసయ్య నీ వేదన - ఆలించి మన్నించును
ఏ పాటి వ్యథలైననూ - ఆ సిల్వలో తీర్చును

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

చరణం 4:
కష్టాల కడలిలో - కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును - కంటిపాపలా కాయును
కష్టాల కడలిలో - కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును - కంటిపాపలా కాయును

కలిగించు విశ్వాసము - కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో - కడగండ్లకే మోక్షము
కలిగించు విశ్వాసము - కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో - కడగండ్లకే మోక్షము

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే

అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా
ఆ యేసు రక్తానికే
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
ఆ యేసు రక్తానికే
సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే

ఆరాధన స్తుతి ఆరాధన
హల్లెలూయా ప్రభు హల్లెలూయా
ఆరాధన స్తుతి ఆరాధన
హల్లెలూయా ప్రభు హల్లెలూయా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area