Type Here to Get Search Results !

అన్ని నామముల కన్న ఘనమైన నామము - Anni Naamamula kanna Ghanamaina Naamamu- Worship Songs Lyrics

అన్ని నామముల కన్న ఘనమైన నామము - బి ఎస్తేరు రాణి - Christian Worship Songs with Lyrics

Singer బి ఎస్తేరు రాణి
Song Writer బి ఎస్తేరు రాణి

అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||

దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు (2)
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||

గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area