సిలువలో నీ ప్రేమ ! Siluvalo nee Prema - Abhijith Kollam - Christian song lyrics
Singer | Abhijith Kollam |
Music | KY Ratnam |
Song Writer | Sayaram Gattu |
బృందం (కోరస్): ఆదియందు వాక్యమయి ఉన్న దేవా
నా విముక్తికై పరమును విడినావా!
సృష్టి కారుడవు మరణము పొందినావా
నిత్య జీవముతో నన్ను దీవించినవా
పల్లవి:
సిలువలో నీ ప్రేమ ! పాపమూ తిసేనయ్యా
మరణము చెరలో నుండి - నన్ను విడిపించేనయ్యా || 2 ||
ఘోర పాపిని నేను - పరిశుద్ధుని చేసితివి
నిత్య జీవములో నన్ను - నిలుపుటకు బలి అయితివి || 2 ||
తాళలేని నీ తాపం - తొలగించేను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం - ఇచ్చేను నాకు స్వరూపం || 2 ||
నను విడిపించుటకు - విలువను విడిచితివి
పరమును చేర్చుటకు - మహిమను మరిచితివి || 2 || || సిలువలో నీ ప్రేమ ||
చరణం1.
దైవ తనయుని దేహం - మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం - చిందించే నిలువునా రుధిరం || 2 ||
నను కాపాడుటకు - రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు - బలిగా మారితివి || 2 || || సిలువలో నీ ప్రేమ ||
బృందం (కోరస్): ఆదియందు వాక్యమయి ఉన్న దేవా
నా విముక్తికై పరమును విడినావా!
సృష్టి కారుడవు మరణము పొందినావా
నిత్య జీవముతో నన్ను దీవించినవా
చరణం2.
అధముడయినట్టి నేను - నీ ప్రేమకు అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము - తీర్చగలేను నీ ఋణము || 2 ||
నిను చాటించుటకు - వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై - ఉప్పుగా నిలిచెదను || 2 || || సిలువలో నీ ప్రేమ ||