నా పైన నీకున్న ప్రేమ-నిను దోషిగ చేసెన్ | Na Paina Neekunna Prema - Nissy Paul Lyrics
Singer | Nissy Paul |
Tune | Paul Emmanuel |
Music | Paul Emmanuel |
Song Writer | Paul Emmanuel |
పల్లవి:
నా పైన నీకున్న ప్రేమ-నిను దోషిగ చేసెన్
ఆ ప్రేమయే నన్నిలా సజీవంగా నిలిపెన్
ఏ ప్రేమ సాటి రాదు నీ శిలువ ప్రేమకు
ఎవరు సరి రారు- నీతో సరిపోల్చుటకు-2
చరణం1.
నా పాప భారమంతా తీసి వేయను
ఆ శిలువ భారమంతా భరించితివా
నా దోష శిక్షను తొలగించను
ఆ ఘోర శ్రమలన్ని సహించితివా 2
ఊహలకందని కార్యం-ఊహకే మించిన త్యాగం-2. (నా పైన)
చరణం2.
నీకంటూ ఏమిదాచుకోలేదయా
సర్వము నాకై అర్పించి నావయా
నిస్వార్ధమైన ప్రేమ నీదే యేసయ్యా
ఆ ప్రేమకు ఇలలో సాటి ఎవరయా-2
ఎడబాయని నీ స్నేహం- విడనాడని నీ బంధం-2. (నా పైన)