సిలువను చూచితిని - Sis. Anjana Sowmya Good Friday Telugu Songs Lyrics

Singer | Sis. Anjana Sowmya |
Music | K Y Ratnam |
Song Writer | John Kennedy |
పల్లవి:
"సిలువను చూచితిని
ఆ విలువను ఎరిగితిని" "2"
"యేసయ్య నీ కాడిని
నే మోయగ తలచితిని" "2"
" సిలువను చూచితిని "
చరణం1.
"సొంతవారే అపహసింపగ
పాపులెల్లరు పరిహసింపగ" "2"
"దూషింపలేదు ద్వేషింపలేదు
సిలువలో వారిని
క్షమియించితివీ" "2"
" సిలువను చూచితిని "
చరణం2.
"మోయలేని సిలువభారం
మోసినావు పాపికొరకు" "2"
"పరిశుద్ధరక్తం చిందించినావు
కలుషాత్ములను రక్షించినావు" "2"
" సిలువను చూచితిని "
చరణం3.
"శోధనలు నను తాకినపుడు
వేదనలతో కృంగినపుడు" "2"
"నీ సిలువను చూచినపుడు
బాధలన్నియు తొలగిపోయే" "2"
" సిలువను చూచితిని "
* * * * * *